అల్లూరి సీతారామరాజు జిల్లాలో తహసీల్దార్ ఆత్మహత్య
- జిల్లాలోని పెదబయలు తహసీల్దార్ శ్రీనివాసరావు ఆత్మహత్య
- ఆఫీసు పక్కనున్న షెడ్ లో ఉరి వేసుకున్న వైనం
- ఇటీవలే పెదబయలులో బాధ్యతలు తీసుకున్న శ్రీనివాసరావు
మరోవైపు ఇటీవల కలెక్టరేట్ లో జరిగిన సమావేశానికి శ్రీనివాసరావు వెళ్లారు. ఈ సందర్భంగా భూముల సర్వే విషయంలో ఆయనపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన మనస్తాపానికి గురై, ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఇటీవలే ఆయన పెదబయలు తహసీల్దారుగా బాధ్యతలను చేపట్టారు.