Kantara: గూగుల్ శోధనలో 'బ్రహ్మాస్త్ర' తర్వాతే ఆర్ఆర్ఆర్, పుష్ప, కేజీఎఫ్2

  • 2022లో గూగూల్లో అత్యధికంగా శోధించిన చిత్రాల్లో బ్రహ్మాస్త్ర నంబర్ 1
  • రెండో స్థానంలో నిలిచిన కేజీఎఫ్ 2
  • టాప్10 జాబితాలో కశ్మీర్ ఫైల్స్, కాంతారకు చోటు
Googles Most Searched Movies 2022 list out

కరోనా కారణంగా దాదాపు రెండేళ్లు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న భారత చలన చిత్ర పరిశ్రమకు 2022 ఎంతో ఊరటనిచ్చింది. ఈ ఏడాదిలో చాలా సినిమాలు నేరుగా థియేటర్లలో విడుదలయ్యాయి. కొన్ని చిత్రాలు అంచనాలను అందుకోలేకపోయినా.. భారీ అంచనాలున్న చిత్రాల్లో కొన్ని పలు రికార్డులు బద్దలు కొట్టాయి. పలు బడా చిత్రాలు కూడా వరుస వాయిదాల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో కలెక్షన్ల వర్షం కురిసింది. తమ అభిమాన తారల నటనను అభిమానులు వెండి తెరపై చూసి మురిసిపోయారు. అంతేకాదు ఆయా చిత్రాల విశేషాలను తెలుసుకునేందుకు గూగుల్ ను ఆశ్రయించారు. 

ఈ క్రమంలో భారత దేశంలో ఈ ఏడాది గూగుల్ లో అత్యధికంగా శోధించిన జాబితాతో పలు చిత్రాలు చోటు చేసుకున్నాయి. 2022లో గూగుల్ లో అత్యధికంగా శోధించిన చలన చిత్రాల్లో బాలీవుడ్ హిట్ చిత్రం బ్రహ్మాస్త్ర ముందుంది. కేజీఎఫ్2 రెండో స్థానంలో నిలిచింది. చిన్న చిత్రంగా వచ్చి అనేక వివాదాల నడుమ భారీ హిట్ అందుకున్న కశ్మీర్ ఫైల్స్ గురించి కూడా జనాలు ఎక్కువగా మాట్లాడుతున్నారు. దాంతో, ఇది మూడో స్థానంలో నిలిచింది. ఇక, ఏడాది ఆరంభంలోనే అఖండ విజయంతో ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిన ఆర్ ఆర్ ఆర్ తో పాటు రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వంలో వచ్చిన సరికొత్త సంచలనం కాంతార కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. 

గూగుల్ లో అత్యధికంగా శోధించిన చిత్రాల జాబితా
1). బ్రహ్మాస్త్ర: మొదటి భాగం - శివ
2). కేజీఎఫ్: చాప్టర్ 2
3). కశ్మీర్ ఫైల్స్
4). ఆర్ ఆర్ఆర్
5). కాంతార
6). పుష్ప: ది రైజ్
7). విక్రమ్
8). లాల్ సింగ్ చద్దా
9). దృశ్యం 2
10). థోర్: లవ్ అండ్ థండర్

More Telugu News