ఓటీటీ సెంటర్స్ లో రేపు స్ట్రీమింగ్ కానున్న తెలుగు సినిమాలివే!

  • రేపు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై కనిపించనున్న సందడి 
  • అమెజాన్ ప్రైమ్ నుంచి రానున్న 'యశోద'
  • 'ఆహా'లో కనిపించనున్న 'ఊర్వశివో రాక్షసివో'
  • ZEE 5 వేదికపై 'మాచర్ల నియోజక వర్గం'
  • 'సోని లివ్' ద్వారా 'లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్' 
Tomorrow OTT Release Movies

శుక్రవారం వచ్చిందనగానే థియేటర్స్ లోకి ఏ సినిమాలు దిగుతున్నాయి? ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి ఏ సినిమాలు వస్తున్నాయి? అనేది అందరిలో ఆసక్తిని రేకెత్తించే అంశంగా మారిపోయింది. థియేటర్ల విషయానికే వస్తే, రేపు అరడజనుకి పైగా సినిమాలు విడుదలవుతుండటం విశేషం. కాకపోతే ఒకటి .. రెండు సినిమాలకి మినహా మిగతావాటికి బజ్ లేదు. ఇక ఓటీటీ సెంటర్ లో మాత్రం ఈ వారం బాగానే సందడి కనిపించనుంది. థియేటర్స్ నుంచి మంచి వసూళ్లను రాబట్టిన 'యశోద' రేపు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. కథ ... కథనం .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ .. సమంత యాక్షన్ పరంగా ఈ సినిమా మంచి మార్కులు కొట్టేసిన సంగతి తెలిసిందే. ఇక రొమాంటిక్ లవ్ స్టోరీగా యూత్ హృదయాలను టచ్ చేసిన 'ఊర్వశివో రాక్షసివో', 'ఆహా'లో  రేపటి నుంచి స్ట్రీమింగ్ కానుంది. నితిన్ హీరోగా చేసిన 'మాచర్ల నియోజక వర్గం' థియేటర్స్ నుంచి ఆశించిన స్థాయి రిజల్టును రాబట్టలేకపోయింది. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా, రేపటి నుంచి ZEE 5 లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఓటీటీ నుంచి ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను రాబడుతుందనేది చూడాలి. థియేటర్ల దగ్గర నిరాశపడిన 'లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్' కూడా రేపు 'సోని లివ్' లో స్ట్రీమింగ్ కానుంది..

More Telugu News