Annavaram Devasthanam: అన్నవరంలో ఇకపై కంచాల్లోనే అన్నప్రసాదం.. నేటి నుంచి అమలు

Annavaram Devasthanam Anna prasadam served in steel plates from today
  • దేవస్థానంలో 35 ఏళ్ల క్రితం ప్రారంభమైన నిత్యాన్నదానం
  • అప్పటి నుంచి అరిటాకుల్లోనే అన్న ప్రసాద వితరణ
  • ఖర్చు తగ్గించుకోవడంలో భాగంగా అరిటాకుల స్థానంలో కంచాలు

అన్నవరం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. 35 ఏళ్ల క్రితం ఇక్కడ నిత్యాన్నదానం ప్రారంభం కాగా అప్పటి నుంచి భక్తులకు అరిటాకుల్లోనే అన్నప్రసాదం అందిస్తున్నారు. అయితే, ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు అరిటాకుల స్థానంలో కంచాలు తీసుకురావాలని, నేటి నుంచి అది అమలు చేయాలని నిర్ణయించారు. 

అరిటాకుల లభ్యత అంతంత మాత్రమే కావడంతోపాటు ఖర్చు తగ్గించుకునే ఉద్దేశంతో కూడా అరిటాకుల స్థానంలో కంచాలు తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు. అలాగే, బఫే పద్ధతిలోనే అన్న ప్రసాద వితరణ చేయాలని నిర్ణయించారు. అయితే, హాలు సిద్ధం కాకపోవడం, క్యూ లైన్ల పనులు పూర్తి కాకపోవడంతో ప్రస్తుతానికి బఫే పద్ధతిని వాయిదా వేశారు. ఇక, భక్తులు తినే కంచాలను శుభ్రం చేసేందుకు యంత్రాలను కూడా సిద్ధం చేశారు.

  • Loading...

More Telugu News