Satyavathi Rathod: రాష్ట్రంపై మోదీ విషం కక్కుతున్నారు.. షర్మిల నాటకానికి ఆయనే సూత్రధారి: సత్యవతి రాథోడ్

Telangana Minister Satyathi Rathod Fires on Modi
  • షర్మిలపై మోదీకి అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందన్న సత్యవతి 
  • ఎమ్మెల్యేలను బేరమాడేందుకు స్వామీజీలను పంపుతున్నారని ధ్వజం
  • కేసీఆర్‌ను తక్కువ చేసి మాట్లాడొద్దని హితవు
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహబూబాబాద్‌ జిల్లాలోని డోర్నకల్‌లో నిన్న విలేకరులతో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంపై ప్రధాని మోదీ విషం కక్కుతున్నారని, ఎమ్మెల్యేలను బేరమాడేందుకు స్వామీజీలను పంపుతున్నారని ఆరోపించారు. 

తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల గురించి ఎన్నోసార్లు సీఎం కేసీఆర్ సహా రాష్ట్ర మంత్రులు ప్రధానిని కలిశారని, అయినా కనికరించని మోదీకి షర్మిలపై అకస్మాత్తుగా అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందని ప్రశ్నించారు. షర్మిల ఇన్ని రోజులు ఆడిన నాటకానికి మోదీనే సూత్రధారని ఆరోపించారు. వార్డు సభ్యురాలు కూడా కాని షర్మిలకు మోదీ ఫోన్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్‌ను తక్కువ చేసి ఎవరూ మాట్లాడొద్దని హితవు పలికారు. తెలంగాణ ప్రజలకే కాదని, ఇక్కడ రాళ్లకు కూడా పవర్ ఉంటుందని మంత్రి హెచ్చరించారు.
Satyavathi Rathod
KCR
YS Sharmila
Narendra Modi

More Telugu News