China: దగ్గితేనే విరిగిపోయిన మహిళ పక్కటెముకలు.. ఎందుకు విరిగాయో చెప్పిన వైద్యులు!

woman ends up with broken ribs after spicy meal
  • చైనాలోని షాంఘైలో ఘటన
  • ఘాటైన ఆహారం తీసుకోవడం వల్ల ముంచెత్తిన దగ్గు
  • విపరీతమైన దగ్గు కారణంగా ఛాతీలో విరిగిపోయిన నాలుగు ఎముకలు
  • ఎముకలకు ఆధారంగా ఉండే కండరం లేకపోవడం వల్లేనన్న వైద్యులు
దగ్గితేనే పక్కటెముకలు విరిగిపోతాయా? ఇదెక్కిడి చోద్యం! అనుకోకండి. నిజంగా విరిగిపోయాయి. చైనాలో జరిగిందీ ఘటన. షాంఘై నగరానికి చెందిన హువాంగ్ అనే మహిళ ఇటీవల కాస్తంత ఘాటైన ఆహారం తీసుకుంది. దీంతో ఆమెను దగ్గు ముంచెత్తింది. దగ్గుతున్న సమయంలో ఛాతీ నుంచి నొప్పి వచ్చింది. తొలుత ఆమె పట్టించుకోలేదు. అయితే, ఆ తర్వాత ఛాతీలో నొప్పిగా అనిపించడంతో వైద్యులను సంప్రదించింది. స్కానింగ్ చేసిన వైద్యులు ఛాతీలోని నాలుగు పక్కటెముకలు విరిగిపోయినట్టు గుర్తించి ఆశ్చర్యపోయారు.  ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది.

అయితే, దగ్గితేనే ఆమె ఛాతీలోని పక్కటెముకలు ఎందుకు విరిగిపోయాయన్న దానికి వైద్యులు కారణం చెప్పారు. ఆమె ఉండాల్సిన దానికంటే చాలా తక్కువ బరువు ఉండడం వల్ల శరీరంలో ఎముకలకు ఆధారంగా ఉండే కండరం ఎదగలేదని చెప్పారు. దీంతో ఆమె దగ్గినప్పుడు అవి విరిగిపోయాయని చెప్పారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నామని, కోలుకున్న తర్వాత వ్యాయాయం, సరైన భోజనం తీసుకోవడం ద్వారా కండరాన్ని పెంచుకోవచ్చని అన్నారు.
China
Shanghai
Ribs
Spicy Meal

More Telugu News