'స్వాతి రెడ్డి' నా ఆల్ టైమ్ క్రష్: హరీశ్ శంకర్

  • 'పంచతంత్రం' ప్రీ రిలీజ్ వేడుకలో హరీశ్ శంకర్ 
  • టైటిల్ దగ్గరే సగం సక్సెస్ అయిందని వ్యాఖ్య 
  • స్వాతి రెడ్డి మంచి ఆరిస్ట్ అంటూ కితాబు 
  • చిన్న సినిమానా, పెద్ద సినిమానా అన్నది అప్పుడే తెలుస్తుందని కామెంట్  
Panchatantram Pre release event

సాధారణంగా కొన్ని చిన్న చిన్న కథలను ఒక టైటిల్ క్రింద ఆవిష్కరించడం వెబ్ సిరీస్ లలో జరుగుతూ ఉంటుంది. అలాంటి ఒక ప్రయోగమే 'పంచతంత్రం' సినిమా విషయంలో జరిగింది. ఐదు కథలతో నడిచే కారణంగానే ఈ సినిమాకి ఈ టైటిల్ ను పెట్టారు. ఈ నెల 9వ తేదీన ఈ సినిమా థియేటర్లకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించారు. 

ఈ వేడుకకి ముఖ్య అతిథిగా వచ్చిన హరీశ్ శంకర్ మాట్లాడుతూ .. "దర్శకుడు ఈ సినిమాకి చక్కని టైటిల్ పెట్టడంలోనే సగం సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాలోని హీరోయిన్స్ అంతా తెలుగువారే అని అన్నారు. నా సినిమాల్లో కూడా తెలుగు అమ్మాయిలకు ఛాన్స్ ఇవ్వాలనే అనుకుంటూ ఉంటాను. కాకపోతే కొన్నిసార్లు న్యాయం చేయలేకపోతుంటాను" అన్నారు. 

"ఇందాకటి నుంచి అంతా ఇది చిన్న సినిమా అంటున్నారు. రిలీజ్ అయిన తరువాతనే చిన్న సినిమానా .. పెద్ద సినిమానా అని తెలుస్తుంది. ఇక స్వాతి రెడ్డి విషయానికి వస్తే, ఆమె నా ఆల్ టైమ్ క్రష్. 'కలర్స్' ప్రోగ్రామ్ నుంచి తను నాకు తెలుసు. 'మిరపకాయ్' సినిమాలో కూడా తను చేసింది. ఆమె ఇక్కడ ఉండటం తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం" అంటూ చెప్పుకొచ్చాడు.

More Telugu News