Samantha: యశోద ఓటీటీ విడుదల ఖరారు.. ఎప్పటి నుంచి చూడొచ్చంటే!

Yashoda On Prime from Dec 9
  • ఈ నెల 9 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్
  • గత నెల 11న విడుదలై విజయం సాధించిన చిత్రం
  • తన నటనతో మెప్పించిన ప్రధాన పాత్రధారి సమంత 
సమంత ప్రధాన పాత్రను పోషించిన చిత్రం 'యశోద'. గత నెల 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. సరోగసీ (అద్దె గర్భం) కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో సమంత తన నటనతో ఆకట్టుకుంది. చిత్రం మొత్తాన్ని తన భుజాలపై వేసుకొని నడిపించింది. 

ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో కూడా సందడి చేయనుంది. యశోద ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రం ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఈనెల 9వ తేదీ నుంచి చిత్రాన్ని స్ట్రీమింగ్ చేస్తున్నట్టు అమెజాన్ ప్రకటించింది. అన్ని భాషల్లోనూ యశోద ఓటీటీలో అందుబాటులోకి రానుంది.
Samantha
yashoda
amezon prime
december 9th
streaming

More Telugu News