Telangana: కేటీఆర్ పై బండి సంజయ్ సంచలన ఆరోపణలు

Take tests come clean Telangana BJP chief accuses KTR of consuming drugs
  • కేటీఆర్ డ్రగ్ బానిస అంటూ వ్యాఖ్యలు
  • రక్తం, వెంట్రుకల నమూనాలు ఇచ్చి నిరూపించుకోవాలని సవాల్
  • పొగాకు తినడంపై తాను సైతం పరీక్షలకు సిద్ధమన్న సంజయ్

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. రాష్ట్ర మంత్రి కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు. కేటీఆర్ కు మత్తు మందులు (డ్రగ్స్) సేవించడం అలవాటు ఉందంటూ, చిత్తశుద్ధి ఉంటే పరీక్షలు చేయించుకుని, సచ్ఛీలుడిగా నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. తెలంగాణ బీజేపీ చీఫ్ కు పొగాకు నమిలే అలవాటు ఉందన్న కేటీఆర్ విమర్శలపై నిర్మల్ ర్యాలీలో భాగంగా బండి సంజయ్ స్పందించారు.


‘‘ఈ ట్విట్టర్ టిల్లు నేను పొగాకు తింటానని అంటున్నాడు. ఇది పచ్చి అబద్ధం. డ్రగ్స్ కు బానిస అయింది కేటీఆర్. నేను నా శరీరంలో రక్తం సహా ఏ నమూనాను అయినా పరీక్షల కోసం ఇవ్వడానికి సిద్ధం. నాకు పొగాకు తినే అలవాటు లేదని నిరూపించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. రక్తం, వెంట్రకల నమూనాలు ఇచ్చి, తాను డ్రగ్స్ తీసుకోవడం లేదని నిరూపించుకునేందుకు కేటీఆర్ సిద్ధంగా ఉన్నాడా?’’ అని బండి సంజయ్ ప్రశ్నించారు. 

అంతేకాదు, హైదరాబాద్, బెంగళూరు డ్రగ్ కేసులను తిరిగి తెరిచి, దర్యాప్తు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. దీనిపై తన ట్విట్టర్ పేజీలో ఓ పోస్ట్ కూడా పెట్టారు. కేటీఆర్ డ్రగ్ బానిస కాబట్టే హైదరాబాద్, బెంగళూరు డ్రగ్ కేసులను మూసివేసినట్టు ఆరోపించారు.

  • Loading...

More Telugu News