Suzuki: కొత్త ఫీచర్లతో విడుదలైన బుర్గ్ మ్యాన్ ప్రీమియం స్కూటర్

  • ఆటో స్టాప్-స్టార్ట్, సైలెంట్ స్టార్ట్ ఫీచర్లు
  • దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.1,12,300
  • స్థానిక పన్నులు, ఇన్సూరెన్స్ చార్జీలు అదనం
  • మూడు రంగుల్లో లభ్యం
Suzuki Burgman Street EX launched in India now comes packed with more features

సుజుకీ మోటార్ సైకిల్ ‘బుర్గ్ మ్యాన్ స్ట్రీట్ ఈఎక్స్‘ పేరుతో కొత్త వేరియంట్ స్కూటర్ ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర రూ.1,12,300. మెటాలిక్ మ్యాటే ప్లాటినం సిల్వర్, మెటాలిక్ రాయల్ బ్రోంజ్, మెటాలిక్ మ్యాటే బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. 


ఈ స్కూటర్లో ప్రధానంగా ఆటో స్టాప్ - స్టార్ట్, సైలంట్ స్టార్టర్ అనే ఫీచర్లు ఉన్నాయి. ఎఫ్ఐ టెక్నాలజీ సాయంతో ఈ స్కూటర్ ఇంజన్ పనిచేస్తుంది. దీనివల్ల అధిక మైలేజీ వస్తుందని సుజుకీ చెబుతోంది. ఎక్కడైనా స్కూటర్ ను ఆపితే, ఇంజన్ దానంతట అదే ఆఫ్ అయిపోతుంది. తిరిగి ఎక్స్ లేటర్ రేజ్ చేస్తే చాలు ఇంజన్ ఆన్ అవుతుంది. ఈ టెక్నాలజీతో ఇంధనం ఆదా అవ్వడంతోపాటు, ఎక్కువ మైలేజీ వస్తుందని సుజుకీ అంటోంది. ఈ విధమైన ఫీచర్ ను హీరో మోటోకార్ప్ తన వాహనాల్లో ఎప్పటి నుంచో అందిస్తోంది.

ఇక స్కూటర్ స్టార్ట్ చేసినప్పుడు పెద్దగా శబ్దం వెలువడదు. అందుకే దీన్ని సైలంట్ స్టార్ట్ ఫీచర్ గా కంపెనీ చెబుతోంది. ఇప్పటి వరకు బుర్గ్ మ్యాన్ స్కూటర్ కు వెనుక 10 అంగుళాల టైర్ ఉంటే, ఈ కొత్త స్కూటర్లో 12 అంగుళాల టైర్ ను ఏర్పాటు చేశారు. దీంతో రహదారులపై మరింత గ్రిప్, నియంత్రణ సాధ్యపడతాయి. బ్లూటూత్ కనెక్టింగ్ సదుపాయం కూడా ఉంది.

More Telugu News