Samantha: 'ఖుషి' నుంచి సమంత తప్పుకుందనే టాక్ .. స్పందించిన టీమ్!

Khushi Movie Update
  • సమంత తాజా చిత్రంగా 'ఖుషి'
  • 60 శాతం షూటింగు పూర్తిచేసుకున్న సినిమా 
  • సమంత ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోలేదన్న మేకర్స్ 
  • మరో హీరోయిన్ కి ఛాన్సే లేదని స్పష్టీకరణ
సమంత తాను ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టుగా కొన్ని రోజుల క్రితం బయటపెట్టింది. అప్పటి నుంచి ఆమె అనారోగ్యం గురించిన పుకార్లు షికారు చేయడం మొదలుపెట్టాయి. 'నేను ఇంకా బతికే ఉన్నాను .. వదిలేయండి' అంటూ మొన్నీమధ్య ఆమె అసహనాన్ని వ్యక్తం చేసినప్పటికీ ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పడటం లేదు. 

సమంత అనారోగ్య కారణాల వలన కొన్ని రోజులుగా 'ఖుషి' సినిమా షూటింగు ఆగిపోయింది. ఇక తన వల్ల కాదని సమంత చెప్పడంతో, మరో హీరోయిన్ కోసం మేకర్స్ ట్రై చేస్తున్నట్టుగా ప్రచారం మొదలైంది. తాజాగా కృతి శెట్టిని తీసుకోవడం జరిగిపోయిందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా మేకర్స్ స్పందించారు. ఈ సినిమా షూటింగు 60 శాతం వరకూ పూర్తయిందనీ, అలాంటి ప్రాజెక్టులోకి మరో హీరోయిన్ ను ఎలా తీసుకుంటారని మేకర్స్ అన్నారు. ఈ సినిమాలో సమంత మాత్రమే కథానాయిక అనీ .. ఈ కథలో సెకండ్ హీరోయిన్ కూడా ఉండదని స్పష్టం చేశారు. అలా ఈ ప్రచారానికి తెరదించేశారు. విజయ్ దేవరకొండ జోడీగా సమంత నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ వారు నిర్మిస్తున్నారు. 
Samantha
Vijay Devarakonda
Khushi Movie

More Telugu News