ఈ ఫ్రైడే థియేటర్లలో దిగుతున్న సినిమాలు ఇవే!

  • ఈ వారం రిలీజ్ అవుతున్న అరడజనుకు పైగా సినిమాలు 
  • ముందువరుసలో కనిపిస్తున్న 'పంచతంత్రం'
  • 'ప్రేమదేశం' వైపు చూస్తున్న యూత్ 
  • అంతగా బజ్ లేని మిగతా సినిమాలు   
Friday Releasing Movies

ఈ శుక్రవారం థియేటర్లలో దిగిపోవడానికి అరడజనుకు పైగా సినిమాలు రెడీ అవుతున్నాయి. బడ్జెట్ పరంగా చూసుకుంటే ఇవన్నీ కూడా చిన్న సినిమాలు. ఈ జాబితాలో పంచతంత్రం .. ప్రేమదేశం .. లెహరాయి .. ముఖచిత్రం .. ఆక్రోశం .. చెప్పాలని వుంది .. రాజయోగం కనిపిస్తున్నాయి. హీరో హీరోయిన్లు కొత్తవాళ్లుగా కనిపించే సినిమాలే ఎక్కువ. 

ఈ ఏడు సినిమాల్లో 'పంచతంత్రం' మాత్రమే ముందు వరుసలో కనిపిస్తోంది. బ్రహ్మానందం .. సముద్రఖని ..  స్వాతి రెడ్డి ప్రధానమైన పాత్రలలో నటించారు. హర్ష పులిపాక ఈ సినిమాకి దర్శకత్వం  వహించాడు. విభిన్నమైన కథా నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాపై ఆసక్తి పెరుగుతూ వెళుతోంది. 

ఇక ఆ తరువాత తన వైపుకు జనాల దృష్టిని తిప్పుకున్న సినిమా ఏదైనా ఉందంటే, అది 'ప్రేమదేశం' అనే చెప్పాలి. మేఘ ఆకాశ్ చుట్టూ తిరిగే కథ ఇది. శ్రీకాంత్ సిద్ధార్థ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. మిగతా సినిమాలపై అంతగా బజ్ లేదు. ఒకవేళ మంచి కంటెంట్ ఉంటే మాత్రం, మౌత్ టాక్ తో ఊపందుకునే అవకాశాలు ఉన్నాయి.

More Telugu News