YSRCP: మొదలైన వైసీపీ 'జయహో బీసీ' సభ.. జగన్ పై ప్రశంసలు కురిపించిన ఆర్.కృష్ణయ్య

  • విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జయహో సభ  
  • బీసీలను అభివృద్ధి మార్గంలో నడిపిస్తున్నారన్న కృష్ణయ్య 
  • జగన్ కు అండగా నిలవాలంటూ బీసీ శ్రేణులకు పిలుపు
jayaho bc sabha in vijayawada

వెనకబడిన కులాలే వెన్నెముక నినాదంతో అధికార వైసీపీ చేపట్టిన జయహో బీసీ మహా సభ విజయవాడలో ప్రారంభమైంది. ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి బీసీలు తరలి వచ్చారు. బీసీ నేతలంతా కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ప్రారంభోపన్యాసం చేస్తూ.. ముఖ్యమంత్రి జగన్ బీసీల స్థితిగతులను మార్చారని కొనియాడారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారని చెప్పారు. జగన్ బడుగు బలహీన వర్గాల పక్షపాతి అని ప్రశంసలు కురిపించారు.

బీసీలను అభివృద్ధి చేసిన దమ్మున్న నాయకుడు జగన్..
ఆంధ్రప్రదేశ్ లో బీసీలను అభివృద్ధి చేసిన దమ్మున్న నాయకుడు మఖ్యమంత్రి జగన్ అని వైసీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య కొనియాడారు. బీసీలకు ఆత్మగౌరవం కాపాడడంతోపాటు అన్ని రంగాల్లో అభివృద్ధి మార్గంలో నడిపించిన ముఖ్యమంత్రి అని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలు చెప్పే మాయమాటలకు బోల్తాపడకూడదని సూచించారు. బీసీల అభివృద్ధికి పాటుపడుతున్న జగన్ కు అండగా నిలవాలని బీసీ శ్రేణులకు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. తన రాజకీయ జీవితంలో బీసీల కోసం ఇంతగా పాటుపడిన, ధైర్యంగా నిలుచున్న ముఖ్యమంత్రిని చూడలేదని ఆర్.కృష్ణయ్య అన్నారు. 

More Telugu News