ఐదేళ్ల గ్యాప్ తరువాత 'పంచతంత్రం'తో వస్తున్న స్వాతిరెడ్డి

  • 'కలర్స్' స్వాతిగా అందరికీ పరిచయం   
  • పెళ్లి తరువాత గ్యాప్ తీసుకున్న స్వాతి 
  • ఈ నెల 9వ తేదీన విడుదలవుతున్న సినిమా 
  • మరో రెండు సినిమాలు కూడా రెడీ  
swathi Reddy Special

హీరోయిన్స్ తమ పెళ్లి తరువాత కొంత గ్యాప్ తీసుకోవడం .. ఆ తరువాత రీ ఎంట్రీ ఇవ్వడం చాలా కాలంగా .. చాలామంది విషయంలో జరుగుతూ వస్తున్నదే. స్వాతి రెడ్డి విషయంలోనూ అదే జరిగింది. స్వాతిరెడ్డి కంటే 'కలర్స్' స్వాతి అంటే వెంటనే అందరికీ అర్థమైపోతుంది. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ భాషల్లోను హీరోయిన్ గా ఆమె తన టాలెంట్ చూపించింది. 

2015లో వచ్చిన 'త్రిపుర' హిట్ తరువాత రెండేళ్లకి ఆమె 'లండన్ బాబులు' సినిమాలో కనిపించింది. ఆ తరువాత ఐదేళ్ల గ్యాప్ తీసుకుని, ఇప్పుడు 'పంచతంత్రం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నెల 9వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. హర్ష పులిపాక దర్శకత్వం వహించిన ఈ సినిమాలో స్వాతి రెడ్డి ప్రధానమైన పాత్రల్లో ఒకరిగా కనిపించనుంది. అన్నట్టు, ఆమె నుంచి మరో రెండు సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతుండటం విశేషం..

More Telugu News