ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల ఫలితాలు.. బీజేపీ, ఆప్ హోరాహోరీ!
- ఆప్ 126, బీజేపీ 120 స్థానాల్లో ఆధిక్యం
- 15 ఏళ్లుగా బీజేపీ చేతుల్లోనే ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్
- ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్
ఈ ఎన్నికల్లో ఆప్ విజయం పక్కా అని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఇక్కడి మునిసిపల్ పీఠం 15 ఏళ్లుగా బీజేపీ చేతుల్లోనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయం సాధిస్తున్నా ఎంసీడీ మాత్రం ఆ పార్టీకి అందని ద్రాక్షగానే మారింది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలను కేజ్రీవాల్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
ఈ క్రమంలో ఈ ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, కడపటి వార్తలు అందేసరికి ఆమ్ ఆద్మీ పార్టీ 126, బీజేపీ 120 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్ ఐదు స్థానాల్లో ఉనికిలో ఉంది. ఈ లెక్కన చూస్తే బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య భీకర పోరు తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి.