జీ20 సదస్సును నిర్వహించడం పెద్ద గొప్పేం కాదు: కేశవరావు

  • దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్న కేకే
  • విపక్షాలపై దాడులు చేయిస్తోందని మండిపాటు
  • ప్రతిపక్షాలు దొంగలు అన్నట్టుగా కేంద్ర పెద్దలు మాట్లాడుతున్నారని విమర్శ
Organising G20 summit is not great says K Keshav Rao

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు విమర్శించారు. విపక్ష నేతలపై కేంద్ర సంస్ధలతో దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. ప్రతిపక్షాల నేతలు దొంగలు, తాము మంచివాళ్లం అనే విధంగా కేంద్ర పెద్దలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పార్లమెంటు సమావేశాల్లో 50 శాతం సమయాన్ని ప్రజా సమస్యలపై చర్చించేందుకు కేటాయించాలని అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జీ20 సదస్సును నిర్వహించడం గొప్ప విషయమేమీ కాదని అన్నారు.

పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశం చేశారు. బొగ్గు కేటాయింపులపై సభలో చర్చించాలని సూచించారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులపై పట్టుబట్టాలని చెప్పారు. విభజన హామీల అమలుపై కేంద్రాన్ని ఒత్తిడి చేయాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆదాయాన్ని కోల్పోయిందని, ఈ విషయాన్ని లేవనెత్తాలని చెప్పారు.

More Telugu News