Balakrishna: చిరూ .. బాలయ్య కాంబో ఛాన్స్ నాకే ఇవ్వాలి: రాఘవేంద్రరావు

Unstoppable 2 Update
  • 'అన్ స్టాపబుల్ 2' వేదికపై రాఘవేంద్రరావు 
  • బన్నీ గురించి ప్రస్తావించిన దర్శకేంద్రుడు 
  • చిన్నప్పుడే బన్నీ డాన్స్ బాగా చేసేవాడని వ్యాఖ్య 
  • ఆయన విషయంలో తాను అన్నట్టుగానే జరిగిందని వెల్లడి
'ఆహా'లో బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'అన్ స్టాపబుల్ 2' టాక్ షోకి సురేశ్ బాబు ... అల్లు అరవింద్ .. రాఘవేంద్రరావు .. కోదండ రామిరెడ్డి వచ్చారు. గీతా ఆర్ట్స్ లో తనతో సినిమా చేయమని బాలయ్య అడిగితే, బాలయ్య - చిరంజీవి ఇద్దరితోను కలిసి ఒక సినిమాను నిర్మించాలనే ఆలోచనలో తాను ఉన్నట్టుగా అల్లు అరవింద్ చెప్పారు. 

ఆ తరువాత కొంతసేపటికి వేదికపైకి వచ్చిన రాఘవేంద్రరావు, బాలయ్య - చిరంజీవి కాంబినేషన్లో అల్లు అరవింద్ చేయాలనుకున్న సినిమాకి దర్శకుడిగా తనకే ఛాన్స్ ఇవ్వాలని అన్నారు. ఈ విషయంలో బాలయ్య తనకి ప్రామిస్ చేయడమే కాకుండా, అల్లు అరవింద్ తో కూడా ప్రామిస్ చేయించాలని అన్నారు. అందుకు బాలయ్యతో పాటు అల్లు అరవింద్ కూడా నవ్వేశారు. 

"చాలా ఏళ్ల క్రితం నేను చిరంజీవి ఇంటికి వెళ్లాను. అప్పుడు బన్నీ చాలా చిన్న పిల్లాడు .. కానీ డాన్స్ భలేగా చేశాడు. అప్పుడు నేను వంద రూపాయలు తీసి ఇచ్చి, అతణ్ణి హీరోగా నేనే పరిచయం చేస్తానని చెప్పాను .. అలాగే జరిగింది కూడా" అని రాఘవేంద్రరావు అన్నారు. అప్పుడు ఆయన ఇచ్చిన ఆ వంద నోటును తన భార్య ఇప్పటికీ అలా దాచి ఉంచడం జరిగిందని అల్లు అరవింద్ చెప్పడం కొసమెరుపు..
Balakrishna
Raghavendra Rao
Allu Aravind
Suresh Babu

More Telugu News