Canara Bank: కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన కెనరా బ్యాంక్

  • క్లాసిక్ డెబిట్ కార్డులతో ఏటీఎం నుంచి రూ.75వేల వరకు విత్ డ్రా
  • పీవోఎస్/ఈ కామర్స్ చెల్లింపుల పరిమితి రూ.2 లక్షలకు పెంపు
  • ప్లాటినం, బిజినెస్ కార్డు దారులకు మరింత వెసులుబాటు
Canara Bank hikes daily debit card transaction limit for ATM withdrawals POS online transactions

ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కెనరా బ్యాంకు ఆదర్శనీయమైన నిర్ణయాలు తీసుకుంది. కస్టమర్లకు అనుకూలమైన చర్యలు తీసుకుంది. డెబిట్ కార్డులపై రోజువారీ లావాదేవీల పరిమితిని పెంచింది. ఏటీఎంల్లో నగదు ఉపసంహరణతోపాటు, పీవోఎస్ చెల్లింపుల పరంగానూ పరిమితులు పెంచింది. ఈ నిర్ణయాలు తక్షణం అమల్లోకి వస్తాయని ప్రకటించింది. 

ఇప్పటి వరకు డెబిట్ కార్డుతో ఏటీఎం నుంచి రూ.40,000 వరకు నగదును విత్ డ్రా చేసుకోవచ్చు. కానీ, ఇకపై ఇది రూ.75,000గా అమల్లో ఉంటుంది. డెబిట్ కార్డుతో పీవోఎస్ మెషిన్లు, ఈ కామర్స్ పోర్టళ్లలో ఒక రోజులో రూ.లక్ష వరకు చెల్లింపులు చేసే సౌకర్యం ఉండగా, దీన్ని రూ.2 లక్షలకు పెంచింది. నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్ సీ/కాంటాక్ట్ లెస్) చెల్లింపుల పరిమితి ఒక రోజులో రూ.25వేలుగా ఉంటే, ఇకమీదటా ఇదే పరిమితి కొనసాగుతుంది. క్లాసిక్ డెబిట్ కార్డులకు ఈ పరిమితులు అమలవుతాయి. ఇక ప్లాటినం, బిజినెస్, సెలక్ట్ డెబిట్ కార్డులతో ఒక రోజులో ఏటీఎం నుంచి రూ.లక్షను ఉపసంహరించుకోవచ్చు. పీవోఎస్/ఈ కామర్స్ చెల్లింపుల పరిమితి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెరిగింది.

More Telugu News