అలాంటి పరిస్థితే వస్తే.. జాబ్ చేసుకుంటా!: కీర్తి సురేశ్

  • క్యాస్టింగ్‌ కౌచ్‌పై కీర్తి సంచలన వ్యాఖ్యలు
  • ఇండస్ట్రీలో వేధింపులు నిజమేనన్న నటి
  • తనకు ఇప్పటి వరకు ఆ అనుభవం ఎదురుకాలేదని వెల్లడి
  • తాను కమిట్మెంట్ ఇచ్చే రకం కాదని తేల్చిచెప్పిన కీర్తి సురేశ్
Keerthy Suresh says if she faced casting couch

సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం చూసే మహిళలకు వేధింపులు నిజమేనని, క్యాస్టింగ్ కౌచ్ ఉందని హీరోయిన్ కీర్తి సురేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, తనకు ఇంతవరకూ అలాంటి అనుభవం ఎదురుకాలేదని ఆమె వివరించారు. ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే సినిమాలు మానేసి జాబ్ చేసుకుంటానని తేల్చిచెప్పారు. అంతేకానీ అవకాశాల కోసం తాను కమిట్మెంట్ ఇచ్చే టైప్ కాదని స్పష్టం చేశారు. 

ఇక మీటూ ఉద్యమం తెరపైకి వచ్చాక సినిమా రంగంలోని క్యాస్టింగ్ కౌచ్ విషయం బయటపడింది. పెద్ద పెద్ద తారలు కూడా తాము ఎదుర్కొన్న వేధింపులను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అవకాశాలు రావనే భయంతోనో మరొకటో.. కారణమేదైతేనేం అప్పటి వరకు ఎవరికీ చెప్పని విషయాలను మీడియా ముందు బయటపెట్టారు. అయితే, వేధింపులకు గురిచేసిన వారి వివరాలను వెల్లడించకుండా అప్పటి సందర్భాన్ని చెప్పి పరోక్షంగా తమను వేధించిన వారిని హెచ్చరించారు. 

ఈ క్రమంలోనే తాజాగా క్యాస్టింగ్ కౌచ్ పై కీర్తి సురేశ్ కూడా స్పందించారు. తనతో పాటు నటించిన కొందరు హీరోయిన్లు, ఇతర నటులు తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి చెప్పారని వివరించారు. మన ప్రవర్తన ఎలా ఉందనేది కూడా ఈ విషయంలో ముఖ్యమేనని వ్యాఖ్యానించారు. మనం ఎలా ఉంటున్నాం.. ఏం చేస్తున్నామనేదాన్ని బట్టి కమిట్మెంట్ అడుగుతారేమోనని అభిప్రాయపడ్డారు. అందుకే తనకు ఇంతవరకు అలాంటి సందర్భం ఎదురుకాలేదని కీర్తి సురేశ్ వివరించారు. 

ఇదిలావుంచితే, కీర్తి సురేశ్ ప్రస్తుతం నాని హీరోగా వస్తున్న దసరా చిత్రంలో నటిస్తున్నారు. చిరంజీవి సినిమా భోళాశంకర్ తో పాటు మామన్నన్, సైరన్ సినిమాల్లో నటిస్తూ కీర్తి బిజిగా ఉన్నారు.

More Telugu News