Xiaomi: యాపిల్ మ్యాక్ బుక్ కు పోటీగా షావోమీ మినీ కంప్యూటర్

Xiaomi may launch Apple Mac mini inspired desktop PC soon
  • జీఎస్ఎం అరెనా పోర్టల్ లో దర్శనం
  • దీని ధర రూ.47 వేల స్థాయిలో ఉండొచ్చని అంచనా
  • మరిన్ని మార్కెట్లలో విడుదలకు అవకాశాలు
చైనాకు చెందిన షావోమీ గత రెండేళ్లలో ఎన్నో ల్యాప్ టాప్ లను మార్కెట్లోకి విడుదల చేయగా, ఇప్పుడు రెండు డెస్క్ టాప్ పీసీల అభివృద్ధిపై దృష్టి సారించింది. ఇందులో ఒకటి యాపిల్ మ్యాక్ బుక్ మాదిరి మినీ డెస్క్ టాప్ పీసీ కావడం ఆసక్తిని పెంచుతోంది. జీఎస్ఎం అరెనా పోర్టల్ లో దీనికి సంబంధించి లీక్స్ కూడా వచ్చేశాయి. డిజైన్ పరంగా యాపిల్ మ్యాక్ బుక్ ను పోలి ఉన్నట్టు ఫొటోలను చూస్తే తెలుస్తోంది.

ఎండీ రైజెన్ 7 6800 హెచ్ ఏపీయూ 45వాట్ చిప్ ఉంటుందని తెలుస్తోంది. అలాగే, రేడియాన్ 680ఎం ఆర్ డీఎన్ఏ2 జీపీయూ, 16జీబీ మెమొరీ, 512జీబీ ఎస్ఎస్ డీ ఉంటాయి. దీని ధర సుమారు రూ.47,000 స్థాయిలో ఉండొచ్చని తెలుస్తోంది. ఇదే నిజమైతే షావోమీ తన నూతన ఉత్పత్తి ద్వారా మరిన్ని మార్కెట్లను చేరుకోవచ్చని టెక్నాలజీ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Xiaomi
mini desktop
may launch

More Telugu News