Brazil: దక్షిణ కొరియాపై బ్రెజిల్ ఘన విజయం.. ఆరో ప్రపంచకప్‌పై కన్ను!

  • సౌత్ కొరియాపై 4-1 గోల్స్ తేడాతో విజయం
  • క్వార్టర్స్‌లో క్రొయేషియాతో తలపడనున్న బ్రెజిల్
  • టైటిల్ పోరుకు మూడు మ్యాచ్‌ల దూరంలో 5సార్లు ప్రపంచ చాంపియన్
Brazil are dreaming of sixth World Cup title

ఫిఫా ప్రపంచకప్‌లో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన బ్రెజిల్ జోరు కొనసాగుతోంది. ఆరో ప్రపంచకప్ టైటిల్ వేటలో దూసుకెళ్తోంది. ఐదుసార్లు వరల్డ్ చాంపియన్ అయిన బ్రెజిల్ నిన్న దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. ‘రౌండ్ ఆఫ్ 16’లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణ కొరియాను గుక్కతిప్పుకోనివ్వకుండా చేసిన బ్రెజిల్  4-1తో అద్భుత విజయం సాధించి వరుసగా ఎనిమిదోసారి ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుని చరిత్ర సృష్టించింది. 

వినిసియస్ జూనియర్, రిచర్లిసన్, లుకాస్ గోల్స్ సాధించారు. బ్రెజిల్ ప్రపంచకప్ చరిత్రలో 1954 తర్వాత తొలి అర్ధ భాగంలో నాలుగు గోల్స్ సాధించడం ఇదే తొలిసారి. కాగా, సౌత్ కొరియాను కంగు తినిపించిన బ్రెజిల్ క్వార్టర్స్‌లో క్రొయేషియాతో తలపడుతుంది. ఆరో ప్రపంచకప్ కోసం కలలు కంటున్నట్టు బ్రెజిల్ దిగ్గజ ఫుట్‌బాలర్ నేమార్ పేర్కొన్నాడు. మరో మూడు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయని, వాటిని కూడా గెలిచి ప్రపంచకప్ సాధించడమే తమ లక్ష్యమని పేర్కొన్నాడు. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన బ్రెజిల్‌కు 2002 తర్వాత ప్రపంచకప్ టైటిల్ కలగానే మిగిలిపోయింది.

More Telugu News