హీరోయిన్ కి హీరో రిక్వెస్ట్: టైమివ్వు పిల్లా కొంచెం టైమివ్వు .. '18 పేజెస్' సాంగ్ రిలీజ్!

05-12-2022 Mon 19:03 | Entertainment
  • సుకుమార్ రాసిన '18 పేజెస్' ప్రేమకథ
  • దర్శకుడిగా పల్నాటి సూర్య ప్రతాప్ 
  • సంగీతాన్ని సమకూర్చిన గోపీసుందర్ 
  • ఈ పాటను హీరో శింబు పాడటం విశేషం
18 pages song released
లవ్ లో పడిన తరువాత జరిగే లావాదేవీలు చాలానే ఉంటాయి. ఆ నేపథ్యంలోనే అలకలు .. గిల్లికజ్జాలు చోటుచేసుకుంటూ ఉంటాయి. ఒకరికి ఒకరు 'ఇగో'ల గోడలు దాటలేక దూరంగా .. భారంగా రోజులు గడిపేస్తూ ఉంటారు. ఒకరి తీరును ఒకరు తప్పుబడుతూ పాటలు పాడేసుకుంటూ ఉంటారు. 

అలాంటి నేపథ్యంలోని ఒక పాట '18 పేజెస్' నుంచి వదిలారు. నిఖిల్ - అనుపమ జంటగా నటించిన ఈ సినిమా నుంచి 'టైమివ్వు పిల్లా కొంచెం టైమివ్వు .. నిన్ను కొంచెం కొంచెం మరిచిపోయే టైమివ్వు' అంటూ ఈ పాట సాగుతోంది. కోలీవుడ్ స్టార్ హీరో శింబు ఈ పాట పాడటం విశేషం. 

గోపీసుందర్ సంగీతాన్ని అందించిన ఈ పాటకి శ్రీమణి సాహిత్యాన్ని సమకూర్చాడు. ప్రేమ్ రక్షిత్ ఈ పాటకి కొరియోగ్రఫీని అందించాడు. సుకుమార్ - గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది. సుకుమార్ కథను అందించిన ఈ సినిమాకి  పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించాడు.