ఢిల్లీలో చంద్రబాబును కలిసిన ఎంపీ రఘురామకృష్ణరాజు

05-12-2022 Mon 17:25 | Andhra
  • జీ-20 సన్నాహక భేటీ కోసం ఢిల్లీలో ఉన్న చంద్రబాబు
  • ప్రత్యేక హోదా కోసం రాజీనామాలపై చంద్రబాబుతో చర్చించిన రఘురామ
  • రాజీనామా చేసేందుకు తాను సిద్ధమని వెల్లడి
  • టీడీపీ ఎంపీల రాజీనామాపై చర్చించానని వివరణ
Raghurama Krishna Raju met Chandrababu in Delhi
దేశ రాజధానిలో ఏపీ రాజకీయాలకు సంబంధించి ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. ఈ భేటీ ఏపీ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

సమావేశం అనంతరం రఘురామ మాట్లాడుతూ, పార్లమెంటు సమావేశాల ఆఖరి రోజున ఎంపీలు రాజీనామా చేసి విభజన హామీల కోసం కేంద్రంపై ఒత్తిడి తెద్దామని జగన్ గతంలో అన్నారని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా కోసం రాజీనామాకు తాను సిద్ధం అని రఘురామ ప్రకటించారు. టీడీపీ ఎంపీల రాజీనామా కోసం ఒప్పించడానికే చంద్రబాబుతో భేటీ అయినట్టు వెల్లడించారు.