ఢిల్లీకి చేరుకున్న జగన్

05-12-2022 Mon 17:03 | Andhra
  • ప్రధాని అధ్యక్షతన జీ20 సదస్సు సన్నాహక సమావేశం
  • దాదాపు 40 పార్టీల అధ్యక్షులకు ఆహ్వానం
  • మధ్యాహ్నమే ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు
Jagan reaches Delhi
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధాని అధ్యక్షతన జీ20 సదస్సు సన్నాహక సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. 2023లో జీ20 సదస్సును నిర్వహించే అవకాశాన్ని భారత్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సదస్సుకు సంబంధించి అజెండాను ఖరారు చేయడానికి అన్ని పార్టీల నేతలతో నరేంద్ర మోదీ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. 

జీ20 సదస్సులో చర్చించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధాని సలహాలను, సూచనలను స్వీకరించనున్నారు. ఈ సమావేశానికి దాదాపు 40 పార్టీల అధినేతలు హాజరుకానున్నారు. మరోవైపు ఈ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పాల్గొంటున్నారు. మధ్యాహ్నమే ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు రాష్ట్రపతి భవన్ లో ఈ సమావేశం జరగనుంది.