ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

05-12-2022 Mon 16:32 | Business
  • లాభాల స్వీకరణకు మొగ్గుచూపిన ఇన్వెస్టర్లు
  • 33 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 5 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
Markets ends in flat mode
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. వరుస లాభాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ఈ క్రమంలో మార్కెట్లు లాభనష్టాల మధ్య కొనసాగుతూ చివరకు ఫ్లాట్ గా ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 33 పాయింట్లు కోల్పోయి 62,834కి పడిపోయింది. నిఫ్టీ 5 పాయింట్ల లాభంతో 18,701 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (3.35%), ఎన్టీపీసీ (1.66%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.58%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.38%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.61%). 

టాప్ లూజర్స్:
రిలయన్స్ ఇండస్ట్రీస్ (-1.46%), టెక్ మహీంద్రా (-1.33%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.76%), డాక్టర్ రెడ్డీస్ (-0.73%), యాక్సిస్ బ్యాంక్ (-0.61%).