బిగ్ బాస్ విన్నర్ గా అతణ్ణి చూడాలనుకుంటున్నాను: ఫైమా

05-12-2022 Mon 15:33 | Entertainment
  • బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసిన ఫైమా
  • 13 వారాల తరువాత జరిగిన ఆమె ఎలిమినేషన్ 
  • రేవంత్ మాటతీరు నచ్చలేదన్న ఫైమా 
  • ఆదిరెడ్డిని విన్నర్ గా చూడాలనుకుంటున్నట్టు వెల్లడి  
Bigg Boss 6  Update
బిగ్ బాస్ హౌస్ లో మొదటి నుంచి కూడా ఫైమా తన జోరును కొనసాగిస్తూ వచ్చింది. అలాంటి ఫైమా నిన్న హౌస్ వదిలి బయటికి రావలసి వచ్చింది. తాజా ఇంటర్వ్యూలో ఫైమా మాట్లాడుతూ .. "బిగ్ బాస్ హౌస్ లో లగ్జరీ లైఫ్ ను అనుభవించాను. నిజంగా అది నాకు చాలా ఆనందంగా అనిపించింది. నిజానికి నేను ఒకటి .. రెండు వారాలకు మించి ఉండనని అనుకున్నాను. అలాంటిది 13వారాల పాటు ఉండటం సంతోషాన్ని కలిగిస్తోంది" అంది. 

"నాకు తెలిసి నాలో మైనస్ లు ఏమీ లేవని అనుకుంటూ ఉండేదానిని. కానీ నాలో వెటకారం ఎక్కువనే విషయం హౌస్ లోకి వెళ్లిన తరువాత తెలిసింది. దానిని సరిచేసుకోవడానికి ట్రై చేస్తాను. ఈ వారం నేను ఎలిమినేట్ అవుతానని అనుకోలేదు. అందరూ కూడా నా ప్లేస్ లో శ్రీసత్య బయటికి రావలసిందని అంటున్నారు" అంది. 

"హౌస్ లో ఉన్న వాళ్లంతా బాగానే ఆడుతున్నారు. చివరికి ఎవరు విన్ అవుతారనేది నాకు తెలియదుగానీ, నేను మాత్రం ఆదిరెడ్డిని విజేతగా చూడాలనుకుంటున్నాను. రేవంత్ కెప్టెన్సీ సమయంలో ఆయన మాటతీరు నాకు నచ్చలేదు. ఆ విషయంలో ఆయనను నిలదీయడమే నాకు మైనస్ అయిందని అంటున్నారు" అంటూ చెప్పుకొచ్చింది.