తనయుడితో కలిసి హిట్-2 సినిమా వీక్షించిన బాలకృష్ణ

05-12-2022 Mon 15:18 | Both States
  • ఇటీవల విడుదలైన హిట్-2 చిత్రం
  • అడివి శేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో చిత్రం
  • చిత్రబృందాన్ని అభినందించిన బాలయ్య
  • బాలకృష్ణ సర్ కు సినిమా సూపర్ నచ్చిందన్న శేష్
Balakrishna watch Hit2 movie with his son Mokshagna
టాలీవుడ్ లో ఇటీవల విడుదలైన హిట్-2 చిత్రం భారీ వసూళ్లతో ముందుకు సాగుతోంది. అడివి శేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ వచ్చింది. నేచురల్ స్టార్ నాని సొంత ప్రొడక్షన్ హౌస్ 'వాల్ పోస్టర్ సినిమా' బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కింది. 

కాగా, హిట్-2 చిత్రాన్ని టాలీవుడ్ అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ కూడా వీక్షించారు. తన కుమారుడు మోక్షజ్ఞతో కలిసి ఈ హిట్ చిత్రాన్ని చూశారు. అనంతరం, చిత్ర హీరో అడివి శేష్, నిర్మాత నాని, దర్శకుడు శైలేష్ కొలనులను అభినందించారు. 

దీనిపై అడివి శేష్ ట్వీట్ చేశారు. 'బాలకృష్ణ సర్ కి ఈ సినిమా సూపర్ నచ్చింది' అని వెల్లడించారు. దర్శకుడు కొలను శైలేష్ విజన్ ను, నా నటనను ఆయన ఎంతగానో మెచ్చుకున్నారు అని శేష్ వివరించారు. అంతేకాదు, హిట్ సిరీస్ లో వచ్చే తదుపరి చిత్రాల్లో అప్పియరెన్స్ ఇవ్వాలని బాలయ్యను సరదాగా అడిగానని కూడా తెలిపారు.