ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు... టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

05-12-2022 Mon 14:57 | Andhra
  • ఢిల్లీలో జీ-20 సన్నాహక సమావేశం
  • చంద్రబాబుకు ఆహ్వానం
  • ఢిల్లీలో గల్లా జయదేవ్ నివాసంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ
  • టీడీపీ ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం
Chandrababu arrives Delhi and held TDP parliamentary party
టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. పార్టీ ఎంపీ, టీడీపీ లోక్ సభాపక్ష నేత గల్లా జయదేవ్ నివాసంలో చంద్రబాబు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. త్వరలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఉభయ సభల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై ఈ భేటీలో చర్చించారు. ఏపీకి సంబంధించి పెండింగ్ లో ఉన్న అంశాలపై ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలను వారికి వివరించారు. 

కాగా, చంద్రబాబు నేటి సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి భవన్ లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే జీ-20 సన్నాహక సమావేశంలో పాల్గొననున్నారు. అటు, ఈ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం జగన్ కూడా ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే.