కర్నూలులో హైకోర్టుకు సినీ పరిశ్రమ మద్దతివ్వాలి: మంత్రి జయరాం

05-12-2022 Mon 14:42 | Andhra
  • కర్నూలులో ఎన్నో సినిమాల షూటింగులు జరుగుతున్నాయన్న మంత్రి 
  • ఇండస్ట్రీకి, కర్నూలుకు మంచి సంబంధం ఉందని వ్యాఖ్య 
  • పవన్ కూడా కర్నూలులో హైకోర్టుకు మద్దతివ్వాలన్న జయరాం 
Minister Jayaram requests film industry to support High Court in Kurnool
కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం చెప్పారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు తెలుగు సినీ పరిశ్రమ మద్దతివ్వాలని కోరారు. కర్నూలులో ఎన్నో సినిమాల షూటింగులు జరుగుతున్నాయని... సినీ పరిశ్రమకు, కర్నూలుకు మంచి అనుబంధం ఉందని చెప్పారు. అందుకే కర్నూలులో హైకోర్టుకు సినీ పరిశ్రమ మద్దతును ఇవ్వాలని కోరారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు మద్దతు తెలపాలని విన్నవించారు.