ఈ సినిమాకు మహేశ్ బాబే సరైన హీరో: విజయేంద్ర ప్రసాద్

05-12-2022 Mon 14:38 | Both States
  • రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో భారీ చిత్రం
  • ఇండియానా జోన్స్ తరహాలో ఉంటుందన్న రాజమౌళి
  • తాజాగా ఈ చిత్రంపై స్పందించిన విజయేంద్ర ప్రసాద్
  • రాజమౌళి అడ్వెంచర్ జానర్ పై ఆసక్తి చూపుతున్నాడని వెల్లడి
  • మహేశ్ ను దృష్టిలో పెట్టుకునే కథ రాశానని వివరణ
Vijayendra Prasad said Mahesh Babu is the right choice for Rajamouli cinema
టాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబుల కలయికలో పాన్ వరల్డ్ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఇండియానా జోన్స్ తరహాలో ఈ సినిమా ఉంటుందని రాజమౌళి ఇప్పటికే సూచనప్రాయంగా చెప్పేశారు. కాగా, ఈ చిత్రంపై రాజమౌళి తండ్రి, ప్రముఖ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ స్పందించారు. ఈ సినిమాకు మహేశ్ బాబే సరైన హీరో అని స్పష్టం చేశారు. 

రాజమౌళి చాలా రోజుల నుంచి అడ్వెంచర్ జానర్లో ఓ చిత్రం తెరకెక్కించాలనుకుంటున్నాడని, ఈ కథకు మహేశ్ బాబు సరైన ఎంపిక అని భావించాడని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. తాను కూడా మహేశ్ బాబును దృష్టిలో ఉంచుకునే కథ రాశానని వివరించారు. మహేశ్ వంటి నటుడికి కథ రాయాలని అనేకమంది రచయితలు కలలు కంటుంటారని తెలిపారు. 

వచ్చే ఏడాది జూన్ నాటికి చిత్రీకరణ ప్రారంభం అవుతుందని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రపంచంలోని అనేక ప్రదేశాల్లో ఈ సినిమా చిత్రీకరణ చేసే ఆలోచన ఉందని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.