Krishna: ఎన్టీఆర్ ఆ ప్రయత్నం మానుకోవడానికి అదే కారణం: కృష్ణ సోదరుడు

  • 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే'లో ఆదిశేషగిరిరావు 
  • 'అల్లూరి సీతారామరాజు' సినిమాను గురించిన ప్రస్తావన 
  • ఆ కథతో ఎన్టీఆర్ మళ్లీ సినిమా చేయాలనుకున్నారని వెల్లడి 
  • కృష్ణ సినిమాను చూశాక ఆ ఆలోచన మానుకున్నారని వ్యాఖ్య  
Adiseshagiri Rao Interview

కృష్ణకంటే ముందుగానే 'అల్లూరి సీతారామరాజు' జీవితచరిత్రను తెరకెక్కించాలని ఎన్టీఆర్ అనుకున్నారు. అయితే ఆయనకంటే ముందుగానే కృష్ణ ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. హీరోగానే కాకుండా, దర్శక నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈ విషయంలోనే ఎన్టీఆర్ కీ .. కృష్ణకి మధ్య విభేదాలు వచ్చాయని అంటారు. 

తాజాగా 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' లో పాల్గొన్న కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు, ఈ విషయాన్ని గురించి మాట్లాడారు. 'అల్లూరి సీతారామరాజు' సినిమా హిట్ అయిన మూడు నాలుగేళ్ల తరువాత, మళ్లీ అల్లూరి చరిత్రకు సంబంధించిన కథను సినిమాగా చేయాలని ఎన్టీఆర్ గారు ప్లాన్ చేశారు. డైలాగ్స్ ను పరుచూరిని వ్రాయమని కూడా చెప్పారట. 

దాంతో వాళ్లు .. ఒకసారి కృష్ణగారు చేసిన 'అల్లూరి సీతారామరాజు'ను కూడా చూడండి' అన్నారట. ఆ తరువాత కృష్ణగారు వాహిని స్టూడియోలో కలిస్తే 'బ్రదర్ ఒకసారి మీ సినిమా చూడాలనుకుంటున్నాను' అని ఎన్టీఆర్ అన్నారు. దాంతో అన్నయ్య దగ్గరుండి చూపించారు. 'బ్రహ్మాండంగా తీశారు .. బ్రహ్మాండంగా చేశారు .. ఇంతకంటే చేయగలిగిందేముంది ఈ సినిమాలో' అన్నారు. ఆ తరువాత ఆ కథను మళ్లీ సినిమాగా తీయాలనే నిర్ణయాన్ని ఆయన విరమించుకున్నారు" అని చెప్పుకొచ్చారు.

More Telugu News