'పంచతంత్రం' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఖరారు!

  • విభిన్నమైన కథా చిత్రంగా 'పంచతంత్రం'
  • ఈ నెల 7వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • ప్రత్యేక అతిథిగా హరీశ్ శంకర్ 
  • ఈ నెల 9వ తేదీన సినిమా విడుదల   
Panchatantram Pre release date confirmed

ఈ మధ్య కాలంలో వైవిధ్యభరితమైన కథలను పట్టుకుని యువ దర్శక నిర్మాతలు సినిమాలు చేస్తున్నారు. బడ్జెట్ .. స్టార్ కాస్టింగ్ కంటే కూడా కంటెంట్ కి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. కంటెంట్ లో విషయం ఉంటే ఆదరించడానికి ఆడియన్స్ ఎంతమాత్రం ఆలోచన చేయడం లేదు కూడా. అలా రూపొందిన మరో సినిమానే 'పంచతంత్రం'.

సృజన్ - అఖిలేశ్ నిర్మించిన ఈ సినిమాకి హర్ష పులిపాక దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంటుకి డేట్ ను ఖరారు చేశారు. ఈ నెల 7వ తేదీన ఈ ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించనున్నారు. స్పెషల్ గెస్టుగా హరీశ్ శంకర్ రానున్నట్టు చెబుతూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. 

బ్రహ్మానందం .. స్వాతి రెడ్డి .. దివ్య శ్రీపాద .. శివాత్మిక .. రాహుల్ విజయ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను, ఈ నెల 9వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రశాంత్ విహారి ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందనేది చూడాలి మరి.

More Telugu News