Gujarat: అహ్మదాబాద్ లో ఓటు వేసిన ప్రధాని.. ఎన్నికల కమిషన్ కు అభినందనలు

  • ప్రజలు ప్రజాస్వామ్యం పండుగను గొప్పగా జరుపుకుంటున్నారన్న ప్రధాని
  • దేశ ప్రజలకు అభినందనలు అంటూ ట్వీట్
  • ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సైతం ఓటు
Gujarat Assembly election phase 2 LIVE Updates PM Modi casts his vote in Ahmedabad

గుజరాత్ రెండో దశ ఎన్నికల పోలింగ్ నేడు సజావుగా సాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తున్నందుకు ఎన్నికల కమిషన్ ను ప్రధాని అభినందించారు. ‘‘ప్రజాస్వామ్యం పండుగను గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ ప్రజలు గొప్పగా జరుపుకుంటున్నారు. దేశ ప్రజలకు నా అభినందనలు. అలాగే, ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తున్నందుకు ఎన్నికల సంఘానికి కూడా నా అభినందనలు’’ అని ప్రధాని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, ఆయన భార్యతో కలసి అహ్మదాబాద్ లో ఓటు వేశారు. విరంఘమ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన హార్థిక్ పటేల్ సైతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక కేంద్రహోంమంత్రి అమిత్ షా అహ్మదాబాద్ లో ఓటు వేయనున్నారు. ఉదయం 9 గంటల వరకు 4.6 శాతం ఓటింగ్ నమోదైంది. 

More Telugu News