బద్దలైన మౌంట్ సెమేరు అగ్నిపర్వతం.. 8 కిలోమీటర్ల వరకు డేంజర్ జోన్!
- నిన్న తెల్లవారుజామున 2.46 గంటల ప్రాంతంలో విస్ఫోటనం ప్రారంభం
- ఒకటిన్నర కిలోమీటర్ల ఎత్తు వరకు కమ్ముకున్న దట్టమైన పొగలు
- అగ్నిపర్వతం బద్దలుకావడం ఇది వరుసగా మూడో ఏడాది
ఆదివారం తెల్లవారుజామున 2.46 గంటలకు అగ్నిపర్వతం విస్ఫోటన ప్రక్రియ ప్రారంభమైంది. ఆ తర్వాత క్రమంగా పరిస్థితులు తీవ్రంగా మారాయి. దీంతో పర్వతం చుట్టూ 5 నుంచి 8 కిలోమీటర్ల పరిధిని డేంజర్ జోన్‌గా ప్రకటించారు. అలాగే, లావా తాకే అవకాశం ఉన్న బెసుక్ కొబోకాన్ నది ఆగ్నేయ ప్రాంతంలోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు. జావా ద్వీపంలో ఉన్న ఈ ‘మౌంట్ సెమేరు’ అగ్నిపర్వతం బద్దలుకావడం ఇది వరుసగా మూడో ఏడాది. గతేడాది డిసెంబరులో సంభవించిన పేలుడులో 50 మంది ప్రాణాలు కోల్పోగా వేలాదిమంది నిరాశ్రయులయ్యారు.