వర్క్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో 17 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం వేటు
- ఈ నెల 1న వారికి మెమోలు ఇచ్చిన ప్రభుత్వం
- రాష్ట్రంలో 2.40 లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు
- తొలగింపు ఆదేశాలు వెనక్కి తీసుకోవాలని జేఏసీ డిమాండ్
- లేదంటే రాష్ట్రవ్యాప్త ఆందోళన తప్పదని హెచ్చరిక
రాష్ట్రవ్యాప్తంగా 2.40 లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో లక్ష మందిని ఆప్కాస్ విభాగంలోకి తీసుకురాగా, మిగతా 1.40 లక్షల మంది ఇంకా ఏజెన్సీలు, థర్డ్ పార్టీల ద్వారా సేవలందిస్తున్నారు. వీరిలో పదేళ్లలోపు సర్వీసు ఉన్నవారు 60 వేల మంది వరకు ఉంటారని అంచనా. ఆప్కాస్‌లో చేరిన వారిలో 17 మందిపై ప్రభుత్వం వేటేసింది. కాగా, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు ఆదేశాలను వెనక్కి తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక జేఏసీ చైర్మన్ ఏవీ నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎం.బాలకాశి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.