Adivi Sesh: ఫస్టు కాల్ మహేశ్ బాబు నుంచి వచ్చింది: అడివి శేష్

HIT 2 Blockbuster Celebrations
  • 'హిట్ 2' బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో అడివి శేష్ 
  • రిలీజ్ రోజున చాలా టెన్షన్ పడ్డానని వెల్లడి 
  • మహేశ్ బాబు మెచ్చుకోవడంతో కన్నీళ్లొచ్చాయని వివరణ  
  • థియేటర్ రెస్పాన్స్ ను మరిచిపోలేనని వ్యాఖ్య   

అడివి శేష్ తాజా చిత్రంగా ప్రేక్షకులను పలకరించడానికి ఈ నెల 2వ తేదీన 'హిట్ 2' సినిమా విడుదలైంది. ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుందంటూ టీమ్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ను నిర్వహించింది. ఈ వేదికపై అడివి శేష్ మాట్లాడుతూ .. " ఈ సినిమా ఎలాంటి టాక్ ను తీసుకొస్తుందా అని నేను చాలా టెన్షన్ పడ్డాను. ఉదయాన్నే నిద్రలేవగానే మహేశ్ బాబుగారి నుంచి మూడు మిస్డ్ కాల్స్ ఉన్నాయి" అన్నాడు. 

"మహేశ్ బాబుగారికి ఆ క్షణమే నేను కాల్ చేశాను. ' నిన్ను చూసి గర్వపడుతున్నాను శేష్' అన్నారాయన. ఆ మాట వినగానే ఒక్కసారిగా నా కళ్లలో ఆనందబాష్పాలు వచ్చాయి. ఆ తరువాత ప్రసాద్ ఐమాక్స్ కి వెళ్లాను. ట్రాఫిక్ జామ్ వలన నా షోకి నేనే లేట్ గా వెళ్లాను. థియేటర్ రెస్పాన్స్ చూసి షాక్ అయ్యాను. నా ప్రయత్నాన్ని ఇంతమంది సపోర్ట్ చేయడం కంటే నాకు కావలసిందేం ఉంటుంది" అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
Adivi Sesh
Meenakshi
HIt 2 Movie

More Telugu News