నేవీ క్యాడెట్ గా చిరంజీవి...అరుదైన ఫొటో ఇదిగో!

  • ఇవాళ నేవీ డే
  • ఆసక్తికర ఫొటో పంచుకున్న మెగాస్టార్
  • గతంలో ఎన్ సీసీలో ఉన్న చిరంజీవి
  • ఇటీవల చిరంజీవిని కలిసిన నేవీ అధికారులు
  • పాత రోజులు గుర్తుకొచ్చాయన్న చిరు
Chiranjeevi shares rare photo

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇవాళ నేవీ డే సందర్భంగా సోషల్ మీడియాలో ఆసక్తికర ఫొటో పంచుకున్నారు. ఆ ఫొటో చిరంజీవి కాలేజీ రోజుల నాటిది. అందులో ఆయన నేవీ క్యాడెట్ యూనిఫాంలో ఉన్నారు. 

గోవా ఎయిర్ పోర్టులో గతవారం తనను కొందరు నేవీ ఆఫీసర్లు కలిశారని చిరంజీవి వెల్లడించారు. దాంతో తనకు పాతరోజులు గుర్తుకువచ్చాయని తెలిపారు. తాను కాలేజీలో చదువుకునే రోజుల్లో ఎన్ సీసీలో నావల్ క్యాడెట్ గా ఉన్నానని వివరించారు. 

కాగా, తనకు క్రమశిక్షణ అలవడిందంటే అందుకు కారణం ఎన్ సీసీ అని చిరంజీవి గతంలోనూ చెప్పారు. ఎన్ సీసీలో ఉన్నప్పుడు 1976 రిపబ్లిక్ డే సందర్భంగా ఏపీ తరఫున రాజభవన్ లో మార్చ్ పాస్ట్ లో పాల్గొన్నానని వెల్లడించారు. ఇటీవల వైఎన్ఎమ్ కాలేజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న చిరంజీవి ఈ సంగతులు పంచుకున్నారు.

More Telugu News