KCR: తెలంగాణ లాగా భారత్ ను కూడా అభివృద్ధి చేసుకుందాం: సీఎం కేసీఆర్

  • మహబూబ్ నగర్ లో బహిరంగ సభ
  • ప్రజలు హామీ ఇస్తే జాతీయ రాజకీయాల్లోకి వెళతామన్న కేసీఆర్
  • తెలంగాణకు బీజేపీ నేతలు ఏమీ చేయరని విమర్శలు
  • చేసేవాళ్లకు అడ్డంకులు సృష్టిస్తారని ఆగ్రహం
CM KCR calls for India development

తెలంగాణ సీఎం కేసీఆర్ మహబూబ్ నగర్ లో టీఆర్ఎస్ కార్యాలయం, కలెక్టరేట్ భవనాలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రస్తావన తీసుకువచ్చారు. 

ప్రజలు హామీ ఇస్తే బీఆర్ఎస్ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి వెళతామని అన్నారు. "నేను మీతో ఉంటాను... మీరు నాతో ఉండాలి. తెలంగాణ లాగా భారత్ ను కూడా అభివృద్ధి చేసుకుందాం" అని కేసీఆర్ పిలుపునిచ్చారు. 

తెలంగాణకు బీజేపీ నేతలు ఏమీ చేయరని, చేసేవారికి అడ్డంకులు సృష్టిస్తుంటారని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం కారణంగా తెలంగాణకు రూ.3 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. ప్రశ్నించిన ప్రభుత్వాలను కూల్చివేయడం మోదీ విధానమా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటైన ప్రభుత్వాలకు ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

దేశంలో ఏం జరుగుతోందో గ్రామీణ ప్రాంతాల్లోనూ చర్చ జరగాలని, దేశ పరిణామాలపై యువత, మేధావులు ఆలోచించాలని పిలుపునిచ్చారు.

More Telugu News