Wedding: సోదరి వివాహం కోసం మొత్తం విమానాన్ని బుక్ చేసిన యువతి.. వీడియో వైరల్

Couple Books An Entire Plane To Travel With Family For Wedding
  • వివాహం కోసం రాజస్థాన్‌లోని జైసల్మేర్‌కు 
  • బంధువులు, స్నేహితులను విమానంలో తీసుకెళ్లిన వైనం
  • వీడియోకు కోటికిపైగా వ్యూస్
భారతీయ వివాహాలు చాలా ఆడంబరంగా, వైభవంగా జరుగుతాయి. ఆహారం నుంచి అలంకరణ వరకు ఎక్కడా రాజీపడకుండా గొప్పగా చేస్తారు. ఖర్చు ఎక్కువైనా పర్లేదు కానీ, రాజీ పడొద్దన్న ధోరణి ఇటీవల పెరిగింది. కరోనా పడగ విప్పిన తర్వాత  శుభకార్యాలన్నీ చాలా వరకు ఇళ్లకే పరిమితమైపోయాయి. ఇప్పుడు ఆంక్షలన్నీ మాయం కావడంతో మళ్లీ మునుపటి పరిస్థితులు వచ్చేశాయి. పర్యాటక ప్రదేశాలు కూడా మళ్లీ తెరుచుకున్నాయి. దేశాలన్నీ తిరిగి పర్యాటకులకు ఆహ్వానం పలుకుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఓ జంట వివాహం కోసం ఏకంగా విమానాన్నే బుక్ చేసింది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి విమానంలో పెళ్లికి బయలుదేరింది. ఇన్‌స్టాగ్రామ్ యూజర్ శ్రేయా షా ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. తన సోదరి వివాహం కోసం మొత్తం విమానాన్ని బుక్ చేసినట్టు ఆమె పేర్కొన్నారు. ఆ తర్వాత విమానంలోని వారందరినీ చూపించారు. చివర్లో పెళ్లితో ఒక్కటి కాబోతున్న జంటను చూపించారు. శ్రేయా షా చెబుతున్న దాని ప్రకారం ఆ జంట వివాహం రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జరుగుతుంది. ఈ వీడియోను ఇప్పటికే కోటిమందికిపైగా వీక్షించారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి    
Wedding
Rajasthan
Flight
Viral Videos

More Telugu News