సీనియర్ పేసర్ షమీకి గాయం... ఉమ్రాన్ మాలిక్ కు చాన్స్
- బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న టీమిండియా
- మూడు వన్డేల సిరీస్ కు ముందే ఎదురుదెబ్బ
- గాయంతో షమీ దూరం
- షమీ స్థానం ఉమ్రాన్ మాలిక్ తో భర్తీ
మూడు వన్డేల సిరీస్ కోసం టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చింది. ఆదివారం తొలి వన్డే జరగనుంది. అయితే భారత్ లో ఉన్నప్పుడే ప్రాక్టీసు చేస్తుండగా షమీ భుజం గాయానికి గురయ్యాడు. అతడు జట్టుతో పాటు బంగ్లాదేశ్ వెళ్లలేదు. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్న షమీ ఇంకా కోలుకోకపోవడంతో అతడి స్థానంలో ఉమ్రాన్ మాలిక్ కు అవకాశం ఇచ్చారు.