మళ్లీ పనిలో అడుగుపెట్టాను: మహేశ్ బాబు

03-12-2022 Sat 19:23 | Both States
  • ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూత
  • విరామం తీసుకున్న మహేశ్ బాబు
  • తండ్రి కర్మకాండలు పూర్తిచేసిన వైనం
  • లేటెస్ట్ పిక్ తో ట్వీట్ చేసిన మహేశ్ బాబు
Mahesh Babu back to work
ఇటీవల తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో మహేశ్ బాబు విరామం తీసుకున్నారు. తండ్రి అంత్యక్రియలు, చిన్న కర్మ, తండ్రి అస్థికలు విజయవాడ వద్ద కృష్ణా నదిలో కలపడం, పెద్దకర్మ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అన్ని కార్యక్రమాలు ముగియడంతో మళ్లీ పనిలో అడుగుపెట్టారు. 

ఈ మేరకు మహేశ్ బాబు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. బ్యాక్ టు వర్క్ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు, తన లేటెస్ట్ పిక్ ను కూడా మహేశ్ బాబు పంచుకున్నారు. ప్రముఖ ఫొటోగ్రాఫర్ సురేశ్ నటరాజన్ తీసిన ఆ ఫొటోలో మహేశ్ బాబు షార్ప్ లుక్స్ తో కనిపిస్తున్నాడు. మహేశ్ ఈ పిక్ పంచుకున్న కొద్దిసమయంలోనే అభిమానులు భారీగా స్పందించారు.

ప్రస్తుతం మహేశ్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ మళ్లీ ప్రారంభమైనట్టు తెలుస్తోంది.