నా కొడుకు బ్రెయిన్ లో ఈ చిప్ ను అమర్చుతా: ఎలాన్ మస్క్

03-12-2022 Sat 17:07 | International
  • న్యూరాలింక్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన మస్క్
  • శరీరంలో చిప్స్ పెట్టేందుకు ప్రయోగాలు
  • ప్రయోగాలు విజయవంతం అవుతాయనే ధీమాలో మస్క్
Will put chip in my sons brain says Elon Musk
న్యూరాలింక్ ప్రాజెక్టుకు ప్రపంచ శ్రీమంతుడు ఎలాన్ మస్క్ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. కృత్రిమ మేధను అధిగమించేలా, మానవుల మేధస్సు సామర్థ్యాలను పెంచడానికి బ్రెయిన్ లో చిప్ అమర్చే ప్రయోగాలను చేపట్టబోతున్నారు. బ్రెయిన్ కంప్యూటర్ ఎంటర్ ప్రైజెస్ టెక్నాలజీతో మనిషి మెదడులో చిప్ పెట్టే ప్రయోగాలను 6 నెలల్లో చేపట్టబోతున్నట్టు ఆయన తెలిపారు. 

పక్షవాతం వచ్చిన వారి అవయవాలను కదిలించేలా చేసేందుకు వెన్నుపూసలో అమర్చేందుకు చిప్, చూపు కోల్పోయిన వారికి సాయపడేలా మరో చిప్ ను రూపొందిస్తామని చెప్పారు. ఈ ప్రయోగాలు విజయవంతమవుతాయనే నమ్మకం ఉందని... చిప్ ను తన బ్రెయిన్ లో, తన కుమారుడి బ్రెయిన్ లో అమర్చేంత నమ్మకం ఉందని అన్నారు.