బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ కి రెడీగా 'హిట్ 2'

03-12-2022 Sat 15:11 | Entertainment
  • అడివి శేష్ హీరోగా రూపొందిన 'హిట్ 2'
  • నిన్న థియేటర్లకు వచ్చిన సినిమా 
  • తొలి రోజునే భారీ వసూళ్లు నమోదు 
  • రేపు రామానాయుడు స్టూడియోస్ లో సెలబ్రేషన్స్ 
HIT 2 Movie BlockBuster Celabrations
అడివి శేష్ తనకంటూ ఒక జోనర్ ను సెట్ చేసుకుని ముందుకు వెళుతున్నాడు. ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్ పాత్రలలో ఈ మధ్య కాలంలో మంచి మార్కులు కొట్టేస్తున్నాడు. అలా ఆయన చేసిన సినిమానే 'హిట్ 2'. నాని నిర్మించిన ఈ సినిమాకి శైలేశ్ కొలను దర్శకత్వం వహించాడు.

మర్డర్ మిస్టరీ నేపథ్యంలో నడిచే ఈ సినిమా, నిన్ననే థియేటర్లకు వచ్చింది. రిలీజ్ కి ముందు నుంచే ఈ సినిమాపై అంచనాలు పెంచడంలో టీమ్ సక్సెస్ అయింది. అడివి శేష్ ఈ కథ పట్ల వ్యక్తం చేసిన విశ్వాసం కూడా ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చేలా చేశాయని చెప్పచ్చు. 

ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా తొలి రోజునే  11.27 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతుందంటూ, ఈ సినిమా టీమ్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ను నిర్వహిస్తోంది. హైదరాబాదు ఫిల్మ్ నగర్లోని రామానాయుడు స్టూడియోస్ గార్డెన్ లో ఈ వేడుకను నిర్వహించనున్నారు, రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది. కొంతసేపటి క్రితం అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు.