తన పీఏ కుమార్తె వివాహానికి హాజరైన సీఎం జగన్

03-12-2022 Sat 14:17 | Andhra
  • సీఎం జగన్ పులివెందుల పర్యటన
  • జగన్ పీఏ రవిశేఖర్ యాదవ్ కుమార్తె వివాహం
  • సతీసమేతంగా హాజరైన సీఎం 
  • వధూవరులకు ఆశీస్సులు
CM Jagan attends a marriage in Pulivendula
ఏపీ సీఎం జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ఆయన తన పీఏ రవిశేఖర్ యాదవ్ కుమార్తె హేమలత వివాహానికి హాజరయ్యారు. 

ఈ ఉదయం ఇడుపులపాయ నుంచి హెలికాప్టర్ లో సతీసమేతంగా బయల్దేరిన సీఎం జగన్ పులివెందులలోని భాకరాపురం చేరుకున్నారు. అక్కడ్నించి రోడ్డుమార్గంలో కదిరి రోడ్డులో ఉన్న ఎస్సీఎస్సార్ గార్డెన్స్ లో జరుగుతున్న పెళ్లికి హాజరయ్యారు. వధూవరులు హేమలత, గంగాధర్ లకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. వారికి ఆశీస్సులు అందించారు. 

అంతకుముందు పెళ్లిమంటపం వద్ద సీఎం జగన్, వైఎస్ భారతిలకు సంప్రదాయబద్ధంగా స్వాగతం లభించింది. సీఎం రాకతో పెళ్లి వేదిక వద్ద భారీ కోలాహలం నెలకొంది. ఈ పెళ్లికి ఏపీ మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యారు.