రాజమౌళికి ప్రతిష్ఠాత్మక అవార్డు

03-12-2022 Sat 14:03 | Entertainment
  • 'ఆర్ఆర్ఆర్' సినిమాకు మరో ఘనత
  • ఉత్తమ దర్శకుడిగా రాజమౌళికి ది న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు
  • ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న 'ఆర్ఆర్ఆర్'
Rajamouli receives prestigious award
టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళిని ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. హాలీవుడ్ లో ప్రతిష్ఠాత్మకంగా భావించే 'ది న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్' అవార్డును రాజమౌళి సొంతం చేసుకున్నారు. 'ఆర్ఆర్ఆర్' చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడిగా ఈ అవార్డును అందుకున్నారు. అమెరికాలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో ఈ అవార్డును ఆయన అందుకున్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళిపై ప్రశంసలు కురుస్తున్నాయి. 

1935 నుంచి ఈ అవార్డులను ఇస్తున్నారు. వార్తాపత్రికలు, మేగజీన్స్, ఆన్ లైన్ పబ్లికేషన్లకు చెందిన పలువురు ప్రముఖులు ఒక బృందంగా ఏర్పడి ఈ అవార్డులను అందజేస్తున్నారు. సినీ పరిశ్రమలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన వారికి ఈ అవార్డులను ఇస్తున్నారు. 

ఇప్పటికే 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా శాటర్న్, సన్ సెట్ సర్కిల్ వంటి పలు అంతర్జాతీయ అవార్డులను దక్కించుకుంది. 'ఆస్కార్' బరిలో కూడా నిలిచింది. దాదాపు 14 విభాగాల్లో ఈ సినిమా ఆస్కార్ వేదికగా పోటీ పడనుంది.