హిట్2 తొలి రోజు కలెక్షన్‌ ఎంతంటే..!

03-12-2022 Sat 12:38 | Entertainment
  • శుక్రవారం విడుదలైన క్రైమ్ థ్రిల్లర్
  • తొలి రోజు దేశ వ్యాప్తంగా రూ. 6.5 కోట్లు వచ్చిన వైనం
  • వారాంతంలో కలెక్షన్లు పెరిగే అవకాశం 
HIT 2 box office collection Day 1
అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్2’ శుక్రవారం విడుదలైంది. 'హిట్ 1' సినిమాను తెరకెక్కించిన శైలేశ్ కొలను, అదే బ్యానర్లో 'హిట్ 2' సినిమాను రూపొందించాడు. విష్వక్సేన్ హీరోగా ‘హిట్1’ మంచి విజయం సొంతం చేసుకుంది. దాంతో, హిట్2 పై ముందునుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా, ‘మేజర్’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయి విజయం అందుకున్న అడివి శేష్ హీరో కావడంతో ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తొలి రోజు ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. 

ఈ చిత్రం దేశ వ్యాప్తంగా మొదటి రోజు ఆరున్నర కోట్ల వసూళ్లు రాబట్టింది. విదేశాల్లో వసూళ్ల గురించి వివరాలు తెలియాల్సి ఉంది. మొదటి రోజు ప్రతి ఆటకు ప్రేక్షకుల తాకిడి పెరిగిందని చిత్ర బృందం భావిస్తోంది. ఈ లెక్కన శని, ఆదివారాల్లో కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉందని ఆశిస్తోంది. పైగా, ప్రస్తుతం పెద్ద చిత్రాలేమీ లేకపోవడం ‘హిట్2’కు ప్లస్ పాయింట్ కానుంది. నేచురల్ స్టార్ నానికి చెందిన వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి, కోమలీ ప్రసాద్‌ కథానాయికలుగా నటించారు.