హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో థాయ్ లాండ్ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం

03-12-2022 Sat 11:38 | Telangana
  • నిన్న రాత్రి యూనివర్శిటీలో పార్టీ
  • పార్టీలో పాల్గొన్న విద్యార్థులు, ప్రొఫెసర్లు
  • ఘటనపై పోలీసులకు ఫిర్యాదు  చేసిన బాధితురాలు
Professor rape attempt on Thailand student in HCU
హైదరాబాద్ సెంట్రల్ యూనిర్శిటీలో దారుణం చోటు చేసుకుంది. థాయ్ లాండ్ కు చెందిన విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. నిన్న రాత్రి ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే... వీకెండ్ కావడంతో నిన్న రాత్రి యూనివర్శిటీలో పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా థాయ్ లాండ్ విద్యార్థినిపై ఒక ఫ్రొఫెసర్ అత్యాచారానికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో... ఆమెను కొట్టాడు. ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరపడానికి పోలీసులు యూనివర్శిటీ క్యాంపస్ కు వెళ్లనున్నారు. మరోవైపు, ఈ ఘటన నేపథ్యంలో యూనివర్శిటీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విద్యార్థులు ఆందోళన చేపట్టారు.