Tollywood: దర్శకుడు గుణశేఖర్ ఇంటిలో మోగిన పెళ్లి బాజా.. వైభవంగా కుమార్తె వివాహం

Tollywood Director Gunasekhar Daughter Neelima weds Ravi
  • ఫలక్‌నుమా ప్యాలెస్‌లో వివాహం
  • వ్యాపారవేత్త రవి ప్రక్యాను పెళ్లాడిన నీలిమ గుణ
  • హాజరైన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ కుమార్తె, నిర్మాత నీలిమ గుణ వివాహం నిన్న అంగరంగ వైభవంగా జరిగింది. వ్యాపారవేత్త రవి ప్రక్యాతో నిన్న హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో వివాహం జరిగింది. నీలిమ-రవి వివాహానికి హాజరైన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లికి హాజరైన సినీ ప్రముఖుల్లో మెగాస్టార్ చిరంజీవి దంపతులు, నిర్మాత అల్లు అరవింద్, బండ్ల గణేశ్ వంటి వారితోపాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా వున్నారు. 

తండ్రి దర్శకత్వంలో తెరకెక్కిన రుద్రమదేవి సినిమాకు నీలిమ గుణ నిర్మాతగా వ్యవహరించారు. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘శాకుంతలం’ సినిమాను కూడా నీలిమ నిర్మించారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

Tollywood
Neelima Guna
Gunasekhar
Neelima Guna Marriage

More Telugu News