Virat Kohli: నాయిస్ స్మార్ట్ వాచ్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా విరాట్ కోహ్లీ

Virat Kohli new brand ambassador for Noise smart watches
  • ఇప్పటికీ తగ్గని కోహ్లీ బ్రాండ్ వాల్యూ
  • నాయిస్ తో ఒప్పందాన్ని నిర్ధారించిన కోహ్లీ
  • ఈ నాయిస్ నన్ను కూడా కదిలించిందంటూ వ్యాఖ్య 
టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ బ్రాండ్ వాల్యూ పైపైకి ఎగబాకుతోంది. ఇటీవల కోహ్లీ మళ్లీ ఫామ్ లోకి రావడం తెలిసిందే. కాగా, ప్రముఖ స్మార్ట్ వాచ్ తయారీ సంస్థ నాయిస్ ఇప్పుడు విరాట్ కోహ్లీతో జట్టు కట్టింది. నాయిస్ స్మార్ట్ వాచ్ లకు కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నాడు. బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించినంత కాలం నాయిస్ ఉత్పత్తులకు కోహ్లీ అన్ని రకాలుగా ప్రచారం చేయనున్నాడు. 

తమ సంస్థకు ప్రచారకర్తగా టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లీ వ్యవహరించనుండడం తమను ఉద్విగ్నతకు గురిచేస్తోందని నాయిస్ సహ వ్యవస్థాపకుడు గౌరవ్ ఖత్రీ అన్నారు. 

ఈ ఒప్పందంపై కోహ్లీ ట్వీట్ చేశాడు. "ఇప్పుడు నేను అధికారికంగా నాయిస్ మేకర్ ను అయ్యాను. ఈ నాయిస్ నన్ను కూడా కదిలించింది... భారత్ లో నెం.1 స్మార్ట్ వాచ్ బ్రాండ్ లో ఇప్పుడు నేను ఒక భాగమే" అని వివరించారు.
Virat Kohli
Noise
Brand Ambassador
Smart Watches

More Telugu News