ఈడీ అదుపులో అక్కినేని ఉమెన్స్ ఆసుపత్రి సీఎండీ మణి!

02-12-2022 Fri 16:19 | Andhra
  • విజయవాడలో అక్కినేని ఆసుపత్రిపై ఈడీ దాడులు
  • ఆసుపత్రి ఫోన్ల స్వాధీనం
  • సీఎండీ మణిని రహస్యంగా విచారిస్తున్న వైనం
  • ఆసుపత్రి చుట్టూ సీఆర్పీఎఫ్ బందోబస్తు
ED raids on Akkineni Womens Hospital in Vijayawada
విజయవాడలోని అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్ సీఎండీ మణిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈడీ అధికారులు మణిని రహస్యంగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది. విదేశీ పెట్టుబడులు, నిధుల మళ్లింపుపై ఈడీ ఆరా తీస్తోంది. ఎన్నారై, మేనేజ్ మెంట్ కోటాల్లో మెడికల్ సీట్లకు కోట్ల నిధులు వసూలు చేసినట్టు మణిపై ఈడీకి సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి నేటి రాత్రి వరకు ఈడీ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. 

ఇప్పటికే ఈడీ అధికారులు ఆసుపత్రి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆసుపత్రిలోకి ఎవరినీ రానివ్వకుండా ఈడీ అధికారులు సీఆర్పీఎఫ్ సిబ్బందిని మోహరించారు. విజయవాడలో అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్ గత ఆగస్టులోనే ప్రారంభమైంది.